Ganguly: భారత్ పాక్ లో ఆడుంటే భారీ స్కోర్లే చేసేది... 1 y ago
ఛాంపియన్స్ ట్రోఫీలో దుబాయ్ వేదికగానే టీమ్ ఇండియా అన్ని మ్యాచ్లనూ ఆడుతోంది. ఇదే కొందరికి నచ్చలేదు. అలాంటి వారిలో ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్లు నాజర్ హుస్సేన్, మైక్ అథర్టన్ ముందున్నారు. వారికి భారత మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. "పాకిస్థాన్ పిచ్లు కాస్త నయం. ఒకవేళ భారత్ కనుక దుబాయ్ లో కాకుండా పాక్ లో ఆడుంటే భారీ స్కోర్లను చేసేది. కొందరు చేస్తున్న వ్యాఖ్యలన్నీ చెత్తవే అలా ఎందుకు మాట్లాడతారో అర్థం కాదు" అని వ్యాఖ్యానించాడు.